ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ జూడో ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ జూడో ఎంపికలు

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14,17 బాలబాలికల జూడో ఎంపిక పోటీలు ఈ నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని కెమిస్ట్‌ భవన్‌లో ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో గూగుల్‌ ఫాం ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు రెండో వారంలో వరంగల్‌ లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర పూర్తి వివరాల కోసం 99897 35567 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

కేయూలో ఆలిండియా వర్సిటీ ఆర్చరీ పోటీలకు ఎంపికలు

కేయూ క్యాంపస్‌ : ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఆర్చరీ పోటీలకు బుధవారం కాకతీయ యూనివర్సిటీలో క్రీడామైదానంలో ఎంపికలు నిర్వహించారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఇంటర్‌కాలేజీయెట్‌ ఆర్చరీ పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఇండియన్‌ రౌండ్‌, రికర్వ్‌ కాంపౌండ్‌ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన వారు ఈఏడాది డిసెంబర్‌లో అసోంలో జరగనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ శాస్త్రి తెలిపారు. ఈ ఎంపికలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. రిజిస్ట్రార్‌ వి. రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. ఇంటర్‌ కాలేజీయెట్‌ టోర్నమెంట్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌. కుమార్‌, డాక్టర్‌ ఏటీబీటీ ప్రసాద్‌, సుమన్‌, న్యూసైన్స్‌ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ పర్విన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement