స్టార్టప్‌లో విజయానికి | - | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లో విజయానికి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

వ్యాపార మౌలిక సూత్రాలు కీలకం

కేయూ క్యాంపస్‌ : భారతీయ స్టార్టప్‌ వ్యవస్థలో విజయానికి వ్యాపార మౌలిక సూత్రాలు కీలకమని హైదరాబాద్‌కు చెందిన పండోరాస్‌ బాక్స్‌ వ్యవస్థాపకురాలు, సర్టిఫైడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ మిలి క టారియా అన్నారు. కాకతీయ యూనివర్సిటీ కెహ బ్‌, హైదరాబాద్‌ టీహబ్‌తో కుదర్చుకున్న ఒప్పందంలో భాగంగా బుధవారం కేయూలోని సెనెట్‌హాల్‌లో నిర్వహించిన స్టూడెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక సాంకేతికత రిటైల్‌ రంగాల్లో స్టార్టప్‌ల విజయానికి తాత్కాలిక ప్రచారం కంటే వ్యాపార మౌలిక సూత్రాలు, సరైన వ్యూహాలు, కార్యాచరణ, సామర్థ్యం ఎంతో ముఖ్య మన్నారు. వాస్తవ ప్రపంచంలో పర్యావరణ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేసి వాటిని విస్తరిస్తే విజయవంతమైన వ్యాపారాలుగా మలుచొచ్చని హైదరాబాద్‌కు చెందిన బయోరిఫోర్మ్‌ వ్యవస్థాపకుడు, సీఈఎ మహ్మద్‌ అజర్‌ మొహియుద్దీన్‌ అన్నారు. స్టూడెంట్‌ డెవలప్‌మంట్‌ప్రోగ్రాంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. కెహబ్‌ డైరెక్టర్‌ సవితాజ్యోత్స్న, నోడల్‌ ఆఫీసర్‌ ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి, కెహబ్‌ కోఆర్డినేటర్లు బి. కిరణ్‌కుమార్‌, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.

పండోరాస్‌ బాక్స్‌ వ్యవస్థాపకురాలు మిలికటారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement