రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని, మానుకోటను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులందరూ బాధ్యతాయుతంగా పని చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి లోపాలను సరి చేయాలన్నారు. డేంజర్‌ జోన్లు, మూలమలుపు వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ శబరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసుశాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తదిరత విషయాలపై రాజీ లేని తనిఖీలు చేస్తున్నామన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులతో పాటు, పిల్లల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement