పూర్వ నాయకులకు
ఘన సన్మానం
కాజీపేట రూరల్ : సమాజమార్పు కోసం ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస కేంద్రంలో మంగళవారం అఖి ల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 90వ వార్షి కోత్సవం సందర్భంగా రెండో రోజు ఏఐఎస్‌ఎఫ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. విద్యా వ్యవస్థలో విష బీజాలు నాటేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ఒకప్పుడు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో 18 ఏళ్లకే ఓటుహక్కు అని నినదించి సాధిస్తే నేడు ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ 90 ఏళ్ల గొప్పచరిత్ర ఏఐఎస్‌ఎఫ్ దేనని, ఎంతో మంది ఉన్నతస్థాయికి ఎదగడానికి దోహదపడిందన్నారు. నేడు కుల సంఘాల ప్రభావం పెరిగిపోతుండడం బాధాకరమని, అయినా వారి సమస్యలపై కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు దృష్టి సారించాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ నాయకుడు శ్రీనివాసుల నాయుడు మా ట్లాడుతూ ఇటీవల వరంగల్‌లో ఏఐఎస్‌ఎఫ్ పెద్ద ర్యాలీ నిర్వహించడం ముందెన్నడు చూడలేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనతో అన్ని వర్గాల ప్రజల హక్కుల హననం జరుగుతోందని, విద్యార్థి లోకం మేల్కొని అప్రమత్తంగా ఉండాలన్నారు. పీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ చల్లా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశా బ్దాల క్రితం తాము చేసిన ఏఐఎస్‌ఎఫ్ పోరాటాల అనుభవాలు గొప్పస్ఫూర్తి కలిగించాయన్నారు.
ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాడాలి..
విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అవుతున్న నే పథ్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఏఐఎస్‌ఎఫ్ పోరాటాలు నిర్వహించాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కోరారు. విద్యార్థి దశలో తాను ఏఐఎస్‌ఎఫ్‌తో ప్రయాణించానని, ఏఐఎస్‌ఎఫ్ నాయకుల ప్రభావం తనపై ఎంతో ఉందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యారంగాన్ని రక్షించుకోవడానికి ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగి రాజన్ మాట్లాడుతూ దేశంలో నూతన విద్యా పాలసీ పేరుతో పేద దళిత, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు
90వ వార్షికోత్సవాల సందర్భంగా జాతీయ, రాష్ట్ర, వివిధ జిల్లాల నాయకులను ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్యయ్య, సీపీఐ రాష్ట నాయకులు పశ్యపద్మ, బాగం హేమంత్‌రావు, బాలనర్సింహ, సాబీర్‌పాషా, బి.విజయసారథి, కర్రె భిక్షపతి, నేదునూరి జ్యోతి, పంజాల శ్రీనివాస్, బి.వి.విజయలక్ష్మి, వి.మదన్, ఆంజనేయులు, సృజన్‌కుమార్, మేడిపల్లి శోభన్‌బాబు, బి.ఆర్.లెనిన్, పల్లె నర్సింహ, రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్, హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉట్కూరి ప్రణీత్ గౌడ్, బాషబోయిన సంతోష్ , వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిడ్డి పార్ధసారథిరెడ్డి, ల్యాదెళ్ల శరత్, తదితరులు పాల్గొన్నారు.
సీసీఐ జాతీయ కార్యదర్శి
పల్లా వెంకట్‌రెడ్డి
ఘనంగా ఏఐఎస్‌ఎఫ్
పూర్వ విద్యార్థుల సమ్మేళనం


