దంతాలపల్లి : మారుమూల తండాకు చెందిన ఓ గిరిజన బిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం ఔషధ విభాగం డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండాకు చెందిన గుగులోత్ కీమా, లక్ష్మ దంపతుల నాలుగో సంతానం రామ్‌దాన్ మారుమూల తండాలో పుట్టి కష్ట పడి చదువుకుని రాష్ట్ర స్థాయిలో తొలి డైరెక్టర్‌గా ఈనెల 28వ తేదీన బాధ్యతలు చేపట్టారు. దీంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ఔషధ విభాగాన్ని పునరుద్ధరించింది. దీనికి రామ్‌దాన్‌ను తొలిడైరెక్టర్‌గా నియమించింది. కాగా, ఈ విభాగం ఔషధాల నాణ్యత, నియంత్రణ, నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది.
రాష్ట్ర ఔషధ విభాగం
తొలి డైరెక్టర్‌గా రామ్‌దాన్
హర్ష వ్యక్తం చేస్తున్న మండల వాసులు


