బీజేపీ శ్రేణుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

బీజేపీ శ్రేణుల వినూత్న నిరసన

Sep 30 2026 1:16 AM | Updated on Oct 2 2026 1:22 AM

కలెక్టరేట్‌ను

ప్రారంభించాలని

కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించకుండా సర్కారు నిర్లక్షం చేస్తోందంటూ బీజేపీ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీసి నిరసన తెలిపాయి. ముందుగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సమస్యలపై పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తూ వరంగల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో ఓ సిటీ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయినా ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. జిల్లా వరంగల్‌ అయినా ప్రతీ పనికి హనుమకొండకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా వరంగల్‌ తూర్పు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నా పట్టించకోవడం లేదన్నారు. కుటుంబంలో పదవుల కోసం తప్పా తూర్పులో గెలిపించిన ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. నెలలో కనీసం ఎమ్మెల్యేగా 20 రోజులైనా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల వినే బాధ్యత లేదా అని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నా యకులు సిద్దం నరేశ్‌, జలగం రంజిత్‌, కుసుమ స తీశ్‌, వంగాల సమ్మిరెడ్డి, రత్నం సతీశ్‌, గురుమూర్తి, బాకం హరిశంకర్‌, శివకుమార్‌, రాణా ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement