కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు పోలీసు స్టేషన్‌లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కాళేశ్వరం జోన్–1 డీఐజీ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, రికార్డులు పరిశీలించి అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఎస్సై, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచూ నమోదయ్యే నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతలు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎస్సై భగవత్, సిబ్బంది పాల్గొన్నారు.
కాళేశ్వరం జోన్–1 డీఐజీ
అంబర్ కిశోర్ ఝా


