కురవి : మద్యం తాగొ చ్చి తల్లిని కొడుతున్నాడనే కారణంతో కుమారుడు.. తండ్రిని చంపా డు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరో లు పీఎస్ పరిధి, కురవి మండలం సూదనపల్లిలో జరిగింది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లకుమల్ల వెంకన్న(58) రోజు తాగొచ్చి తన భార్య వెంకటమ్మను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయాన్ని వెంకటమ్మ తన కొడుకు సునీల్‌కు చెప్పింది. దీనిని మనసులో పెట్టుకున్న సునీల్.. సోమవారం (ఈ నెల28న) రాత్రి ఇంటికి వచ్చాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో తండ్రి వెంకన్నతో అమ్మను ఎందుకు కొడుతున్నావని ఘర్షణ పడ్డాడు. కర్రతో, ట్యూబ్‌లైట్ ఐన్ ఫ్రేమ్‌తో కొట్టడంతో వెంకన్న చనిపోయాడు. అ నంతరం సునీల్ పరారయ్యాడు. మంగళవారం ఉదయం మృతుడి తమ్ముడు, ఇతర బంధువులు ఈ ఘటనను చూసి వెంకటమ్మకు తెలిపారు. దీంతో బంధువుల వద్దకు వెళ్లిన వెంకటమ్మ హుటాహుటిన గ్రామానికి చేరుకుంది. కుమారుడు.. తండ్రిని చంపిన విషయం తెలియడంతో మరిపెడ సీఐ పవన్‌కుమార్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీరోలు ఎస్సై సంతోష్ తెలిపారు. కాగా, సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
తండ్రిని చంపిన తనయుడు
సూదనపల్లిలో ఘటన


