410.24 మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయం | - | Sakshi
Sakshi News home page

410.24 మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయం

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌

మహబూబాబాద్‌ రూరల్‌: డిస్ట్రిక్ట్‌ ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి (జిల్లా ప్రధాన న్యాయమూర్తి)గా బాధ్యతలు స్వీకరించిన కె.మురళీమోహన్‌ను జిల్లా కోర్టులో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

భూముల సర్వే పారదర్శకంగా చేపట్టాలి

దంతాలపల్లి: మండలంలో భూముల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అనిల్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దముప్పారం, కాలువపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న భూ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సర్వేలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సర్వే నిర్వహించిన తర్వాత హద్దులు పెట్టి రైతుల మధ్య బేదాభిప్రాయాలు లేకుండా చూడాలన్నారు. రైతుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, సర్వేయర్‌ నిత్యశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ప్రవేశాలకు ముగిసిన ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ రీజనల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ప్రవేశాల కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌ క్రీడల్లో మొత్తం 57 సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరైనట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ తెలిపారు. ప్రతిభ, మెరిట్‌ ఆధారంగా ఎంపికై న క్రీడాకారులకు త్వరలో సమాచారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంపికల ప్రక్రియను సాట్‌ అబ్జర్వర్లు సతీశ్‌రెడ్డి, దీపక్‌ ప్రసాద్‌, సుధాకర్‌ యాదవ్‌, సంతోష్‌చారి, రాజేశ్‌ పర్యవేక్షించారు. డీఎస్‌ఏ కోచ్‌లు రాయబారపు నవీన్‌కుమార్‌, కందికొండ రాజు, బొడ్డు విష్ణువర్ధన్‌, రాజారపు రమేశ్‌, కూరపాటి రమేశ్‌, ఓనపాకల శంకర్‌, మహ్మద్‌ అఫ్జల్‌, దేవిక, శ్రీమన్నారాయణ, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు మంచాల స్వామిచరణ్‌, కోడెం రాజలింగం, సాంబయ్య, సారంగపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: వ్యాపారులు నిత్యం రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌లో ఉత్పత్తులు అమ్మితే భద్రత ఉంటుందని నమ్మిన రైతులకు ఇక్కడ కూడా మోసమే జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిని అధికారులు ప్రోత్సహించడం, వారిని నమ్మి పంటలను అమ్మిన రైతులకు డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వకుండానే వ్యాపారులు ఉడాయించిన సంఘటనలు ఉన్నాయి.

మార్కెట్‌లకు రూ.20కోట్ల ఆదాయం

రైతులు పండించిన పంటలకు సరైన ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌లను ఏర్పాటు చేసింది. కాగా, జిల్లాలోని మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్‌లలో ఎక్కువగా.. తొర్రూరు మార్కెట్‌లో తక్కువగా పంటలను అమ్ముకుంటారు. ఇలా జిల్లాలో సీజన్‌కు మూడు లక్షల బస్తాల మిర్చి, లక్ష క్వింటాళ్ల ధాన్యం, పదివేల క్వింటాళ్ల పత్తి, మరో నాలుగు వేల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్నలు, అపరాల విక్రయాలు జరుగుతాయి. వీటిని మార్కెట్‌లో అమ్మినందుకు రైతుల నుంచి వసూళ్లు చేసే చార్జీలు, వ్యాపారుల నుంచి వచ్చే పన్నులు మొత్తం కలిపి సీజన్‌కు రూ. 20కోట్ల మేరకు ఆదాయం ఉంటుంది.

నిబంధనలు గాలికి..

రైతులకు న్యాయం చేయాల్సిన మార్కెటింగ్‌ అధికారులు పలువురు వ్యాపారులతో కుమ్మకై ్క నిబంధనలను గాలికి వదులుతున్నారు. కాగా, వ్యాపారి కొనుగోలు చేసే పంటస్థాయిని బట్టి రూ.50వేల నుంచి రూ. 2లక్షల మేరకు ఎన్‌ఎస్‌సీ బాండ్స్‌ మార్కెట్‌కు అందచేసి లైసెన్స్‌ తీసుకోవాలి. ఈ సందర్భంగా ఈ–నామ్‌లో పొందుపరిచిన విధంగా రేటు నిర్ణయించడం, ఉత్పత్తులు కొనుగోలు రోజునే రైతులకు డబ్బులు చెల్లించాలి. లేదా అదే రోజు పేరిట చెక్కు రాసి ఇవ్వాలి. కానీ, జిల్లాలోని మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్‌లలో మాత్రం అధికారులు చెప్పింది కాకుండా వ్యాపారులు చెప్పిందే పద్ధతి అన్నట్లు కొనసాగుతోంది. రైతుల ఉత్పత్తులు కొని వారాల తరబడి వాయిదా పెట్టడం, ధర విషయంలో కూడా వ్యాపారులు కుమ్మకై ్క రైతులను ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు

ప్రతీ వ్యాపారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలను కొనుగోలు చేయాలి. ఈ– నామ్‌ విధానం ప్రకారం రేట్లు పెట్టాలి. అదే రోజు డబ్బులు ఇవ్వాలి. అలా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. లైసెన్స్‌లు రద్దు చేస్తాం. రైతులు కూడా పంటలు అమ్మిన వెంటనే డబ్బులు తీసుకోవాలి. ఇవ్వకుంటే ఫిర్యాదు చేయాలి. పంటలు కొని డబ్బులు ఇవ్వని వ్యాపారులపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం.

– వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

అధికారులే బాధ్యత వహించాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్‌లో రైతులు ఉత్పత్తులు అమ్ముకుంటే వారికి ఇవ్వాల్సిన డబ్బులకు మార్కెట్‌ అధికారులే బాధ్యత వహించాలి. దళారులు రంగప్రవేశం చేసి ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటే గమనించాల్సిన అధికారులు మౌనంగా ఉండడం శోచనీయం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రైతులు మోసానికి గురికాకుండా చూడాలి. – నల్లపు సుధాకర్‌,

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు

వాయిదా చెక్కులు ఇస్తున్నారు

ఈ–నామ్‌ టెండర్‌ ద్వారా వ్యాపారులు మా సరుకులు కొనుగోలు చేస్తారు. కొనుగో లు చేసిన రోజునే మా అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ చేయాలి. అలా కాకుండా వ్యాపారులు వాయిదా పద్ధతిలో చెక్కులు ఇస్తున్నారు. దీంతో తాము బ్యాంకుల చుట్టూ తిరగడం, ఒక్కొక్కసారి చెక్‌ బౌన్స్‌ అవుతుంది. మా చేతిలోకి డబ్బులు వచ్చేంత వరకు ఇబ్బందికరంగా ఉంటుంది.

– కముటం సురేందర్‌, రైతు, కేసముద్రం

వీరభద్రస్వామి ఆలయం

ముందుకు సాగని వీరభద్రస్వామి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌

రెండున్నర ఏళ్లయినా నిధుల మంజూరులో జాప్యం

నమ్మకంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ఇష్టారాజ్యంతో ఆగం అవుతున్నారు. స్థాయికి మించిన ఉత్పత్తులు కొనుగోలు చేయడం, రైతులకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడం, వాయిదాలు పెట్టి రైతులను తిప్పించుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు వ్యాపారులు ఇచ్చే మామూళ్లతో మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో కేసముద్రం మార్కెట్‌లో పత్తి, ధాన్యం రైతులు, ప్రస్తుతం మహబూ బాబాద్‌ మార్కెట్‌లో మొక్కజొన్న, మిర్చి అమ్మిన రైతులకు సుమారుగా రూ.60లక్షల మేరకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు ఉడాయించి ఐపీ పెట్టిన సంఘటపై రైతులు లబోదిబోమంటున్నారు.

మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలం

ఇష్టారాజ్యంగా పంట

ఉత్పత్తుల కొనుగోళ్లు

డబ్బుల ఎగవేతకు ప్రయత్నాలు.. రైతుల ఇబ్బందులు

ప్రేక్షకపాత్రలో మార్కెటింగ్‌ అధికారులు

మహబూబాబాద్‌: జిల్లాలో పలు ప్రాంతాల్లో వివిధ (6–ఏ)కేసుల్లో సీజ్‌ చేసిన 410.24 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా విక్రయించనున్నట్లు డీసీఎస్‌ఓ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31లోపు డీసీఎస్‌ఓ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1న అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో టెండర్‌ విధానం ద్వారా ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తారన్నారు. రేషన్‌ డీలర్లు, పీడీఎస్‌ కేసుల్లో ఉన్నవారికి వేలంలో పాల్గొనేందుకు అర్హత లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement