ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌

తొర్రూరు: ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లను మంగళవారం డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ఔట్‌ పేషెంట్స్‌, ఆపరేషన్‌ థియేటర్‌లను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–2010 ప్రకారం ఆస్పత్రులు నిర్వహించాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే సీజ్‌ చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో బోర్డులపై చికిత్సల ధరలు ప్రదర్శించాలన్నారు. తనిఖీలో డిప్యూటీ డెమో రాజ్‌కుమార్‌, రాకేష్‌, మనోహర్‌, కృష్ణ, సత్య ప్రకాష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement