● డీఏఓ విజయచంద్ర
మహబూబాబాద్ రూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఏఓ విజయచంద్ర సూచించారు. మానుకోట పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు, విత్తన మేళాలో డీఏఓ మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతుందని, రైతులు పంట మార్పిడి చేయాలన్నారు. మినుములు, పెసర, కందులు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న కూరగాయల సాగు, సబ్సిడీ వివరాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ టెక్నికల్ రాంజీ, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


