● ఆగస్టు 8 నుంచి పొడిగింపు అమలు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాట్నా– చర్లపల్లి మధ్య 14, చర్లపల్లి– పాట్నా మధ్య 14 రైళ్ల సర్వీస్‌లుగా పొడిగిస్తూ నడిపిస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాట్నా– చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 14 సర్వీస్‌లుగా, చర్లపల్లి–పాట్నా (03254) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 7 సర్వీస్‌లుగా, చర్లపల్లి–పట్నా (03255) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు 7 సర్వీస్‌లుగా ప్రయాణిస్తూ కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుందని సీపీఆర్వో తెలిపారు. 3 ఏసీ, 3 ఏసీ ఎకనామి, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్‌లకు దక్షిణ మధ్య రైల్వే, మధ్య రైల్వే పరిధిలో చర్లపల్లి–పాట్నా మధ్య కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగపూర్ స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.


