ప్రభుత్వ ఉపాధ్యాయుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయుడి రిమాండ్‌

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

వర్ధన్నపేట: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు తెలిపారు. మంగళవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్‌.. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. భాస్కర్‌ ఈ నెల 26న మధ్యాహ్నం గ్రామంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక కోసం తల్లి వెతుకుతూ భాస్కర్‌ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ చిన్నారి ఉంది. అక్కడ జరిగిన ఘటనను ఆ చిన్నారి తన తల్లికి వివరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఉపాధ్యాయుడు భాస్కర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

బాలికకు సీకేఎంలో వైద్య పరీక్షలు

కాశిబుగ్గ: బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సమాచారం. మహిళా ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది.

పాముకాటుతో

బాలుడి మృతి

మల్హర్‌: పాముకాటుతో ఓ బాలుడు మృతిచెందన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని తాడిచర్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిచర్ల గ్రామానికి చెందిన రిజ్వాన్‌(16) మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పాముకాటుకు గురయ్యాడు. గమనించిన ఇంటి పక్కన బంధువులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో రిజ్వాన్‌ మృతిచెందాడు. తండ్రి అక్బర్‌ అనారోగ్యంతో కొన్ని రోజులుగా భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అతని వెంట భార్య ఉంటుంది. కాగా కుమారుడు రిజ్వాన్‌ ఒక్కడే ఇంటి వద్ద ఉన్న సమయంలో పాముకాటుతో ప్రమాదానికి గురయ్యాడు. తండ్రి అక్బర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ పేర్కొన్నారు.

చికిత్స పొందుతున్న

విద్యార్థిని మృతి

పలిమెల : నీట్‌లో తక్కువ మార్కులొచ్చాయని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థి ని చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగె కృష్ణవేణి (18) ఇటీవల విడుదలైన నీట్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మంగళవారం మరణించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై తమకు సాయంత్రం 7 గంటల వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement