విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

రేగొండ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని దామరంచపల్లిలో మంగళవారం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరంచపల్లి గ్రామానికి చెందిన కాడపాక సాగర్‌ (34) తన పొలం వద్ద మోటార్‌ ఆన్‌ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాగర్‌ భార్య మధుశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ ఎస్సై హేమ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

నల్లబెల్లిలో ఆశ కార్యకర్త..

నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలో విద్యుత్‌షాక్‌తో ఆశ వర్కర్‌ బర్తిపాక లక్ష్మి (37) మంగళవారం మృతి చెందారు. ఎస్సై సాయి ప్రసన్న కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన గద్దె మహేందర్‌ సోదరి బర్తిపాక లక్ష్మి ఆశ వర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా ఆమె తన అన్న మహేందర్‌ ఇంట్లోనే నివసిస్తుంది. మంగళవారం స్నానం చేసిన అనంతరం బాత్రూమ్‌లో దుస్తులు వేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగకు తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలో ఓ రైతు, వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో ఆశ కార్యకర్త మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement