దాడికి దారితీసిన వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

దాడికి దారితీసిన వివాహేతర సంబంధం

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

పాలకుర్తి టౌన్‌: జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో వివాహహేతర సంబంధం కారణంగా జరిగిన ఘర్షణ చివరికి కత్తుల దాడికి దారితీసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై దూలం పవన్‌కుమార్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన కొడిశాల అజయ్‌ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గతంలో పలుమార్లు ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తతోపాటు గ్రామానికి చెందిన గాదరి హరికృష్ణ, మాచర్ల కాంత్రి, జఫర్‌గడ్‌ మండలం తిమ్మంపేటకు చెందిన పులి వర్ధన్‌, చందు, వరుణ్‌, లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆనంద్‌లతో కలిసి సోమవారం అర్ధరాతి కొడిశాల అజయ్‌ ఇంటికి వెళ్లారు. మాట్లాడుతుండగా ఒకరు అజయ్‌పై కత్తితో దాడి చేయడంతో అదే కత్తిని గుంజుకొని అజయ్‌ ఆరుగురిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో పులి వర్ధన్‌, చందుకు తీవ్రగాయాలు కాగా గాదరి హరికృష్ణ, మాచర్ల కాంత్రి, వరుణ్‌, ఆనందర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయలైన క్షతగాత్రులను వెంటనే హనుమకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు గాదరి హరికృష్ణ తండ్రి గాదరి సోమయ్య ఫిర్యాదు మేరకు అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు. అజయ్‌ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పరస్పరం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వివాహిత మహిళలే టార్గెట్‌..!

కత్తుల దాడి ఘటనలో ప్రధానంగా వినిపిస్తున్న కొడిశాల అజయ్‌ పై గతంలో ఓ మహిళను తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి దేవరుప్పుల పోలీస్‌ సేష్టన్‌లో కేసు నమోదైనట్లు స్థానికులు తెలిపారు. అతనికి గతంలో వివాహం కాగా అనారోగ్యంతో భార్య మృతి చెందినట్లు తెలిపారు.

కత్తులతో పరస్పరం దాడులు

నలుగురికి తీవ్ర గాయాలు

విచారణ చేపట్టిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement