కక్షిదారులకు న్యాయమే కోర్టుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కక్షిదారులకు న్యాయమే కోర్టుల లక్ష్యం

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కె.మురళీమోహన్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : కక్షిదారులకు న్యాయం చేయడమే కోర్టుల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కన్నోజు మురళీమోహన్‌ అన్నారు. సోమవారం నూతన ప్రధాన న్యాయమూర్తిగా మురళీమోహన్‌ బాధ్యతలు స్వీకరించారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి అనంతరం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మురళీమోహన్‌ మాట్లాడుతూ.. బార్‌ అసోసియేషన్‌ సలహాలు, సూచనలు స్వీకరిస్తూ కక్షిదారుల న్యాయం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. తక్షణమే న్యాయం చేకూరేలా న్యాయవాదులు సహకరించాలని, బార్‌ అండ్‌ బెంచ్‌ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం అందించేలా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. జడ్జిలు శాలిని శాకెల్లి, కృష్ణతేజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జనరల్‌ సెక్రటరీ జంగం సిద్ధార్థ, సీనియర్‌ న్యాయవాదులు కేశవరావు, సురేష్‌ రెడ్డి, జీపీ నగేష్‌ కుమార్‌, పీపీ కొంపల్లి వెంకటయ్య, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, రవికుమార్‌, శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement