● బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి
కాజీపేట రూరల్ : ఆదర్శగ్రామ నిర్మాణానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృషి చేయాలని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం బాలవికాస, సోపార్ ఆధ్వర్యంలో మోడల్ విలేజ్ ప్రోగ్రాం కింద గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాభివృద్ధి కమిటీలకు ఆదర్శ గ్రామ నిర్మాణం, వనరుల ఆధారిత సామాజిక అభివృద్ధిపై అవగాహన ఉండాలన్నారు. గ్రామ పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, పర్యావరణ, తదితర అభివృదధి సాధించే మార్గాలపై నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాలోని 150 గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు, బాలవికాస మోడల్ విలేజ్ ప్రోగ్రాం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వసంత, ప్రాజెక్ట్ స్టాప్ రాజ్‌కుమార్, ఫీల్డ్ కో ఆర్డినేటర్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.


