అక్రమ గర్భస్రావం కేసులో దర్యాప్తు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

అక్రమ గర్భస్రావం కేసులో దర్యాప్తు ముమ్మరం

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

జనగామ : జిల్లాలో కలకలం రేపిన లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అక్రమ గర్భస్రావం వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సోమవారం పట్టణంలోని సంజయ్‌నగర్‌లోని అనసూర్య నివాసాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి ఆరా తీశారు. గర్భస్రావం ఎలా జరిగిందనే అంశంపై కాలనీ వాసులను అడిగామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఆర్‌ఎంపీ శ్రావణ్‌తో పాటు గర్భస్రావం చేసిన అనసూర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మరోవైపు మృతి చెందిన మహిళ తల్లి, అలాగే హనుమకొండకు చెందిన స్కానింగ్‌ కేంద్ర నిర్వా హకుడు ప్రవీణ్‌ పరారీలో ఉండగా, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు.

డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement