ఖరీఫ్ పంటలకు పెరిగిన కనీస మద్దతు ధరలు 2026–27 సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త ఎంఎస్‌పీ ప్రకటింపు
జనగామ : కేంద్ర ప్రభుత్వం 2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు పంటల కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రధాన ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ పెంచింది. అత్యధికంగా సన్ ఫ్లవర్ పంట క్వింటాల్‌కు రూ.622, పత్తి (మిడియం, లాంగ్ స్టేపుల్) రూ.557, నైజర్ విత్తనాలకు రూ.515, నువ్వులకు రూ.500 పెంచారు. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అధిక ప్రోత్సాహం లభించింది. మొక్కజొన్నకు కేవలం రూ.10, పెసరకు రూ. 12 మాత్రమే పెంపు ఇవ్వడం గమనార్హం. రైతులకు కనీస గిట్టుబాటు ధర హామీ ఇవ్వడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


