హసన్‌పర్తి : ఇంజనీరింగ్ విద్యార్థులకు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించేది ప్రొఫెషనల్ విద్య అని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాలని సూచించారు. సమయ పాలన పాటిస్తే చదువుపై శ్రద్ధతోపాటు క్రమ క్షణ కూడా పెంపొందుతుందన్నారు. తరగతులకు హాజరుకాకుండా తప్పుడు అడుగు వేస్తే జీవితం నాశనమవుతుందని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ప్రతీ రోజు వారికి కొంత సమయం కేటాయించాలన్నారు. వారి ముందు ఎలాంటి గొడవలకు దిగొద్దన్నారు. తమ పిల్లల చదువుపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవంగా మెదగాలన్నారు. ప్రపంచంలో సంభవిస్తున సాంకేతిక విద్యకనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సావీనర్‌ను ఆవిష్కరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దీపక్ గార్గ్, ప్రొ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ మహేశ్, రిజిస్ట్రార్ రమణరావు, డీన్ డాక్టర్ అర్చనారెడ్డి, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమయ పాలన పాటించాలి
ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్
వరదారెడ్డి


