విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

కేయూ క్యాంపస్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ ఆడిటోరియంలో కెహబ్‌, తెలంగాణ రాష్ట్ర టీహబ్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం( ఎంఓయూ)లో భాగంగా విద్యార్థుల్లో వ్యవస్థాపకత ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌, స్టార్టప్‌లపై అవగాహన కల్పించేందుకు సోమవారం నిర్వహించిన ఇండక్షన్‌ ప్రోగ్రాంలో వీసీ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎంఓయూ ద్వారా 3వేలమంది విద్యార్థులకు విస్తృత అవకాశ వేదికను కల్పించి టీహబ్‌ మెంటరింగ్‌ సహకారంతో వారి విన్నూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్ల డించారు. కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం, హైదరాబాద్‌ టీహబ్‌ ప్రతినిధి శ్రవణ్‌ మాట్లాడుతూ కేయూ నుంచి దరఖాస్తులు చేసుకున్న సుమారు 1,700 మంది విద్యార్థుల్లో ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కార్యక్రమానికి 400 మందిని ఎంపికచేసినట్లు వెల్లడించారు. వీరికి 12 నుంచి 15 ప్రత్యేక శిక్షణ సెషన్లు నిర్వహించి వ్యవస్థాపకత స్టార్టప్‌లపై అవగాహన కల్పించబోతున్నామన్నారు. కెహబ్‌ డైరెక్టర్‌ సవితాజ్యోత్స్న, రూసానోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌ రెడ్డి, టీహబ్‌ ప్రతినిధులు ఆశిష్‌ శర్మ, భరత్‌, కెహబ్‌ సంయుక్త డైరెక్టర్లు సిద్ధార్థ, బొల్లం కిరణ, కేయూ కో ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రమణ, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె. భిక్షాలు పాల్గొన్నారు.

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement