మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని సఖి మండలి, మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో వర్షాలు కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ తాల్ సప్తాహ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు హారతితో మొదలుపెట్టి భక్తి పాటలు ఆలపిస్తూ భజనలు చేస్తూ రాత్రి 10 గంటల వరకు మహేశ్వరీ భవన్ ఆవరణలో రాధాకృష్ణుల సన్నిధిలో సీ్త్రలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరు ఒకచోట చేరి పూజలు చేస్తున్నారు.
హేమాచలుడికి ప్రత్యేక పూజలు
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి నాగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ సివిల్ జడ్జి పూజిత వేర్వేరుగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికారు. అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, రాజీవ్‌శర్మ జడ్జిల కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు జరిపించి వేద మంత్రోచ్ఛరణతో స్వామివారిని శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పర్యాటకుల రద్దీ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వివరించారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని టూరిజం ఇన్‌ప్లుఝెన్సర్లు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఈఓ భాస్కర్, ఆర్‌ఐ రమేశ్, సీసీ నాగరాజు ఉన్నారు. అలాగే నెదర్లాండ్ దేశస్తుడు మనోలో ఆలయాన్ని సందర్శించి రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని కొనియాడారు.
కేఎంసీ పూర్వవిద్యార్థుల
యాప్ ఆవిష్కరణ
కాశిబుగ్గ: కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో KMC Alumini Connect అధికారిక మొబెల్ యాప్‌ను హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆవిష్కరించారు. కేఎంసీ అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్, సన్‌షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కస్తూరి శ్రీధర్ తరఫున ఈ యాప్‌ను రూపొందించారు. క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, సర్జికల్ అంకాలజిస్టు సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, రెమిడీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బీవీఆర్ శ్రీధర్‌రావు, డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ వారం రోజుల్లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోని ఉంటుందని వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జార్జ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కృపాల్‌సింగ్, డాక్టర్ వినోద్‌రెడ్డి (ఆస్ట్రేలియా), డాక్టర్ ఎన్‌ఎస్‌డీ దుర్గాప్రసాద్, డాక్టర్ లక్ష్మయ్య, చందర్ తేజావత్ ఉన్నారు.


