పెట్రోల్‌ పోసి సజీవదహనం | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసి సజీవదహనం

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

పథకం ప్రకారం పిలిచి..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పాత కక్షలు, రాజకీయ వి భేదాల నేపథ్యంలో వ్యాపారిపై పెట్రోల్‌ పోసి ని ప్పంటించి హత్య చేసిన కేసును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరా రీలో ఉన్నాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుమాముల ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన వ్యాపారి అడుప మహేశ్‌ (45)పై ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామి అలియాస్‌ కుమార్‌ కక్ష పెంచుకున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధి వద్ద తన రాజకీయ ప్రాధాన్యతను మహేశ్‌ దెబ్బతీస్తున్నాడని అనుమానం పెంచుకున్నారు. మహేశ్‌ను హత్య చేయాలని ముందుగానే కుట్ర పన్నాడు. ఇందుకోసం మరో ఏడుగురు సహచరులతో కలిసి పథకం రచించాడు.

పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య పరిమళకాలనీ రోడ్డు నంబర్‌–2 వద్ద మహేశ్‌పై నిందితులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య అడుప నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్‌ కేసు విచారణ చేపట్టారు.

ప్రత్యేక బృందాలతో వేగంగా ఛేదింపు..

నిందితులను పట్టుకునేందుకు మామునూరు ఏసీపీ వెంకటేష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామితో పాటు గంధం నరేశ్‌, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్‌ అలియాస్‌ బండి శ్రీను, లాసాని రాంసాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సురేశ్‌ కోసం గాలింపు కొనసాగుతోంది.

కఠినశిక్ష పడేలా చర్యలు..

కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత తెలి పారు. ఈ కేసును వేగంగా ఛేదించిన మామునూరు ఏసీపీ వెంకటేష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్ట ర్లు బాబులాల్‌, సుబ్బారెడ్డి, దేవేందర్‌, శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌, టాస్క్‌ఫోర్స్‌ సి బ్బందిని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అభినందించారు.

రాజకీయ, పాత కక్షలతో వ్యాపారిని హత్య చేసిన ముఠా

ప్రధాన నిందితుడిపై

గతంలో హత్య కేసు

ప్రత్యేక బృందాలతో కేసు ఛేదించిన

పోలీసులు..

ఏడుగురి అరెస్ట్‌..

వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement