● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
గార్ల: సీపీఐ పోరాటాల ఫలితంగానే గార్ల పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గార్ల సమీపంలోని పాకాల ఏటిపై నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా రాంపురం, మద్దివంచ జీపీల పరిధి గ్రామాల ప్రజలు గార్లకు రావడానికి రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధుల విడుదల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, పార్టీ రాష్ట్ర నేత కట్టెబోయిన శ్రీనివాసరావు, అజయ్‌సారథి, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, రాగం రమేశ్, కృష్ణమూర్తి, జనార్దన్, గిరిప్రసాద్, హరినాయక్, భీముడు, వీరన్న, రమేశ్, వీరన్న, నాగేష్, నాగరాజు, లోకేష్, వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, నీలమ్మ, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.


