మహబూబాబాద్ రూరల్ : ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని పలువురుని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గూడూరు మండలం చెర్ల తండాకు చెందిన బోడ మహేశ్ అనే వ్యక్తి నీతి ఆయోగ్ డైరెక్టర్ అని చెప్పుకుని తిరిగేడు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద నుంచి సుమారు రూ.1.85 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మహేశ్‌ను అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులను పరిస్థితులను నమ్మొద్దని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. టౌన్ ఎస్సై గడ్డం ఉమా, సిబ్బంది పాల్గొన్నారు.
ఒకరి అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు


