● తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
దంతాలపల్లి : ఏడాది బాలుడిపై కుక్క దాడికి పా ల్పడింది. ఈ ఘటనలో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. అసోం రా ష్ట్రానికి చెందిన కపిజ, అబ్దుల్ మాటింగ్ దంపతులు బతుకుదెరువు నిమిత్తం మండల కేంద్రానికి వ చ్చారు. ఇక్కడ ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పని చేస్తూ జీవ నం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సంవత్సరం వయసు ఉన్న ఆ దంపతుల కుమారుడు నూర్ నబిపై పౌల్ట్రీ ఫామ్‌లో కుక్క దాడికి పాల్పడింది. ఈ ఘటనలో బాలుడి చెవికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


