● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ‘సర్’ ప్రక్రియలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సర్ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమర్పించిన వివరాల ప్రకారమే ఓటర్ జాబితా ప్రకారం మ్యాపింగ్ చేసి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ల వివరాలు వెంటనే సంబంధిత అధికారులు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఫారాలు నింపే విషయంలో సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు ఉంటే ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌కుమార్, నాయకులు మార్నెని వెంకన్న, సురేష్‌నాయుడు, శ్యాంసుందర్‌శర్మ, రామారావు, పెరుగుకుమార్, నవీన్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.


