లక్ష్మీ నర్సింహస్వామి రూపం
● త్రిదండి చినజీయర్‌స్వామి
లింగాలఘణపురం : లక్ష్మీనర్సింహస్వామి వారి అవతారం అద్భుతమని త్రిదండి చినజీయర్ స్వామి ఉద్భోదించారు. బుధవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండం బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం, గుట్టపై శంఖుచక్ర నామాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి దశావతారాల్లో లక్ష్మీనర్సింహస్వామి, రాముడి అవతారం ఎవరు కోరకుండానే లోకకల్యాణార్థం వెలసిన అవతారాలన్నారు. ఆలయాల సంపదను కాపాడుకునేందుకు గ్రామస్తులంతా ఏకం కావాలన్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, అందుకు ముందుగా పూర్వకాలంలో పూజారులుగా ఉన్న శ్రీనివాసాచార్యుల నుంచి మొదలు పెట్టాలని, అప్పుడు మరోసారి ఆలయాన్ని సందర్శిస్తానన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వంచ మహేశ్వర్‌రెడ్డి, వంచ రాంరెడ్డితో పాటు సర్పంచ్ పోరెడ్డి సంతోషిమల్లారెడ్డిని అభినందించారు. కాగా ఆలయానికి రూ.లక్ష నుంచి రూ.50 వేల వరకు విరాళాలు ఇచ్చిన భక్తుల్లో ఎం.శ్రీధర్‌రెడ్డి, వి.మహేందర్‌రెడ్డి, సి.హెచ్ రవీందర్‌రెడ్డి, అన్‌రెడ్డి నర్సిరెడ్డి, కె.భాస్కర్‌రెడ్డి, ఎన్.అంజిరెడ్డి, సి.హెచ్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరగగా జనగామ మున్సిపల్ చైర్మన్‌పర్సన్ కె.బాలమణిశ్రీనివాస్, స్థానిక ఉపసర్పంచ్ నవీన్, చెట్టిపల్లి రవీందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


