విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Jul 22 2026 1:35 AM | Updated on Jul 22 2026 1:35 AM

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌ : విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే ఉన్నత విద్యాసంస్థల లక్ష్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం రూసా 2.0 ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రీసెర్చ్‌ ప్రాజెక్టుల ప్రాజెక్టుల ఫెల్లోలతో విశ్వవిద్యాలయం రూసా నోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టుల ద్వారా నాణ్యమైన పరిశోధన ఫలితాలు వెలువడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ప్రచురించడంతోపాటు పేటెంట్లు సాధించాలన్నారు. రీసెర్చ్‌ ప్రాజెక్టుల, ప్రాజెక్టు ఫెల్లోలు తమ ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ ఇన్విస్టిగేటర్లకు పూర్తి సహకారం అందించాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. కేయూలో ఏర్పాటుచేసిన కె హబ్‌ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోనికి రానుందన్నారు. అనంతరం రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, ప్రొఫెసర్‌ ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement