హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేతరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.
జైశ్రీరామ్ ధాన్యానికి
రికార్డు ధర
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జైశ్రీరామ్ (పాతవి) రకానికి చెందిన ధాన్యానికి రికార్డుస్థాయిలో ధర పలికింది. మార్కెట్‌కు జైశ్రీరామ్ ధాన్యం అమ్మకానికి వస్తుండగా, ఇటీవల గరిష్ట ధర రూ.3,800ల వరకు పలికింది. మంగళవారం 298 బస్తాల ధాన్యం మార్కెట్‌కు రాగా, జైశ్రీరామ్ రకానికి చెందిన ధాన్యానికి గరిష్ట ధర రూ.4,013లు, కనిష్ట ధర రూ.2,669లు పలికింది.
పోలింగ్ బూత్‌ల పరిశీలన
ఇనుగుర్తి: మండలంలోని పలు పోలింగ్ బూత్‌లను జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి మండలంలోని చిన్ననాగారం గ్రామంలోని 77, 78 బూత ్‌లతో పాటు మండలకేంద్రంలోని 59 నుంచి 64 నంబర్ల పోలింగ్ బూత్‌లను తనిఖీ చేశారు. సర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో రెవెన్యూ అధికారులు, బీఎల్‌ఏ, బీఎల్‌ఓలు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతికి ప్రవేశ పరీక్షలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మామూనూరు నవోదయ ప్రిన్సిపాల్ ఎస్. ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 31వ తేదీ వరకు నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
బాలికను గర్భవతిని చేసిన యువకుడు?
● పొక్సో కేసు నమోదు?
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని ఓ గ్రా మానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని మా యమాటలు చెప్పి ఓ యువకుడు గర్భవతిని చేసిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు బాలిక, యువకుడి మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొ నసాగగా ఆమె గర్భవతి అయింది. విషయం కాస్త బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మహబూబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.


