బాలగేయం | - | Sakshi
Sakshi News home page

బాలగేయం

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

సాహస బాలలు..

రాము సోము కలిశారు

కొండపై గుహకు వెళ్లారు

గుహలో ఉన్నది ఒక ఏరు

గలగల పారే సెలయేరు

సెలయేటి పక్కన ఒక చెట్టు

చెట్టుమీద ఉన్నది ఒక భూతం

భూతం భూతం ఇది భూతం

అందరిని మింగే పెద్ద భూతం

పెద్ద పెద్దగా అరిచింది

నోరును తెరిచి వచ్చింది

రామూ సోమూ చూశారు

ఒరలో కత్తిని తీశారు

భూతం మెడపై వేశారు

అందరి బాధను తీర్చారు

సాహస బాలలు అయ్యారు

పెద్దల మెప్పును పొందారు.

పద్మ త్రిపురారి, తెలుగు పండిట్‌

– జనగామ

Advertisement
 
Advertisement
Advertisement