ఖిలా వరంగల్ : బక్రీద్ పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. టాస్ ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గవిచర్ల క్రాస్ రోడ్డుపై నక్కలపల్లి శివారు రైస్ మిల్లు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి చెందిన 9 మంది బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం టాస్ ఏస్ వాహనంలో సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రోజంతా అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి రాత్రి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నక్కలపల్లి శివారులోని రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే టాటా ఏస్ వాహనం కమాన్ పట్టి విరిగింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రూహి రేష్మ (22) అక్కడికక్కడే దుర్మరణం చెందగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వి వరాలు సేకరించారు. క్షతగాత్రులను ఎంజీఎం తరలించగా.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
టాటా ఏస్ బోల్తా.. యువతి దుర్మరణం
9 మందికి స్వల్ప గాయాలు
బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు


