తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపడుతున్న విశ్రాంత ఉద్యోగులు
నెహ్రూసెంటర్: గేటు ఎదుట ధర్నా చేస్తున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
నెహ్రూసెంటర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల డిపో కమిటీ అధ్యక్షుడు ఎం.సుధాకర్, జిల్లా నాయకులు గుడెల్లి భిక్షపతి, బీఎన్ రావు డిమాండ్ చేశారు. డిపో ఆవరణలో సోమవారం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, తదితరాలు ఇవ్వడంలో ఆర్టీసీ యాజమాన్యం అలసత్వం వహిస్తుందన్నారు. శాంతియుతంగా బస్‌భవన్ ఎదుట ఆందోళణలు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించేలా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఇప్పటికై నా పెండింగ్ బకాయిలను విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎండీ సాదిక్, ఈఎస్‌చారి, జి.హరికుమార్, జి.గోపాల్‌రెడ్డి, ఎండీ అజీమ్, వెంకన్న, సాంబయ్య, వెంకటేశ్వర్లు, డీఎన్ రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, పివి.చారి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
తొర్రూరు డిపో ఎదుట..
తొర్రూరు: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఆర్టీసీ సంస్థకు సేవలు అందించామని, ఈపీఎఫ్ ఆధారంగా వచ్చే పింఛన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు విశ్రాంత ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అందించాల్సి ఉన్నా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 70మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.


