● కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న జనం
● డజన్ ముంజలు రూ.50 చొప్పున
విక్రయిస్తున్న చిరువ్యాపారులు
● ఆరోగ్యానికి మేలుచేస్తాయని నమ్మకం
మహబూబాబాద్: ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉపశమనం కోసం ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తూనే పుచ్చ, కర్భూజ, కీరదోస వంటి పండ్లను ఆరగిస్తున్నారు. ఇందులో భాగంగానే సీజనల్‌గా వచ్చే మంజులను తీనేందుకు సైతం జనాలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంలో జోరుగా విక్రయిస్తున్న ముంజలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వేసవి ఎండల నుంచి ఉపశమనంతోపాటు ఆరోగ్యానికి చలువ చేస్తుందనే నమ్మకంతో మంజలు కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో కురవి మండలం నేరడ గ్రామ శివారు రాయినిపట్నానికి చెందిన రాంబాబు డజన్ ముంజలు రూ.50 చొప్పున జిల్లా కేంద్రంలో రోజూ విక్రయిస్తున్నాడు.


