పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

నెహ్రూసెంటర్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ సూచించారు. కళాశాల నిర్మాణ పనులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పూర్తికావస్తున్న భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి సిద్ధం చేయాలని తెలిపారు. అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, పెండింగ్‌ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ వెంకట్‌ లకావత్‌ పాల్గొన్నారు.

వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

మహబూబాబాద్‌: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక ప్రత్యేక విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలపై కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యావారో త్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నా రు. కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఫొటోలు డాక్యుమెంటరీ తయారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణ మూర్తి, డీఐఈఓ మదార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement