మహబూబాబాద్: నిమ్మకాయల ధరలు విపరీతంగా పెగుతున్నాయి. జిల్లాలో నిమ్మతోటల సాగు లేకపోవడం, ప్రస్తుతం వేసవి తాపానికి, పెళ్లలో ఎక్కువగా నిమ్మకాయలను వినియోగించడంతో డిమాండ్ పెరిగింది. హోటళ్ల యాజమానులకు సైతం కాయల కొనుగోలు భారంగా మారింది. ఒక నిమ్మకాయకు సుమారు రూ.10వరకు ధర పలుకుతుంది.
200మంది నిమ్మకాయల వ్యాపారులు
జిల్లాలో 18 మండలాల్లో సుమారు 200మంది నిమ్మకాయలు విక్రయిస్తున్నారు. చిన్నవి కేజీ రూ.220, పెద్దవి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. డోర్నకల్ మండలంలోని గోర్లచర్ల, అమ్మాపురం, బంజర, కురవి మండలంలోని సూదనపల్లితోపాటు పలు గ్రామాల్లో, మానుకోట మండలంలోని మల్యాల కేవీకేలో నిమ్మతోటలు ఉన్నా వాటి కాయలు అన్ సీజన్‌లో వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఏలూరు, సమీప జిల్లా అయిన ఖమ్మం నుంచి జిల్లాకు నిమ్మకాయలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.
పెరిగిన డిమాండ్..
పెళ్లిల సీజన్ కావడం, బిర్యానీ వంటి ఆహారంలో నిమ్మకాయ, క్యారెట్, ఉల్లిగడ్డలు, కీర ఇతరత్రా వాటి ఏర్పాటు చేస్తారు. సోడా తయారీ, నిమ్మకాయ రసం, పలు జ్యూస్‌లో వాడకం వలన కూడా ధరలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు ఎక్కువగా నిమ్మరసంపై ఆసక్తి చూపుతుండడం కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇదిలా ఉండగా.. హోటళ్ల నిర్వాహకులు గ్యాస్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కింటుండగా.. నిమ్మకాయల ధరలు అదనపు భారంగా మారాయి. హోటళ్లకు భోజనం చేసేందుకు వచ్చే కస్టమర్లు నిమ్మకాయ ఉందా.. అని అడిగిన తర్వాతనే టోకెన్ తీసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
వేసవి ఎండలతో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్
కేజీ రూ.240
జిల్లాలో లేని నిమ్మతోటల సాగు


