బాలల భవితకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

బాలల భవితకు రక్షణ

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

నైతిక విలువల్లో శిక్షణ..

న్యూశాయంపేట : పిల్లలు తమ మూలాలు మరిచి పోకుండా చిన్న వయస్సులోనే సరైన పునాది పడితే వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతా రు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాంత్రీక జీవనంలో నైతిక విలువల ప్రాధాన్యతను గుర్తించిన వరంగల్‌కు చెందిన ‘అహెలే హదీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ చిన్నారులకు ఆధునిక విద్యతోపాటు సంప్రదాయ విలువలు మేళవించి వారి ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకం చేయడానికి నడుం బిగించింది. మత సామరస్యం, మానవతా విలువల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చిన్నారులకు ధార్మిక కార్యక్రమాలపై అవగాహన, ఇస్లాం బోధనలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పది రోజుల పాటు వరంగల్‌ నర్సంపేట రోడ్‌లోని కార్యాలయంలో సమ్మర్‌ క్యాంపు నిర్వహించింది. దైనందిన జీవితంలో పాటించాల్సిన క్రమశిక్షణ, తదితర అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించింది. ఈ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది.

శిక్షణలో ప్రధానం అంశాలు..

చిన్నారులకు ఈ శిక్షణలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా నైతిక విలువలు బోధించారు. పెద్దలను గౌరవించడం, నిజాయితీ, సాటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండడం వంటి మౌలిక సూత్రాలపై శిక్షణ అందించారు. ఇవే కాకుండా ధార్మిక బోధనల్లో ఇస్లాం మూల సూత్రాలు, ఖురాన్‌ పఠనం, ప్రవక్త జీవన విధానం గురించి చిన్నారులకు అర్థమయ్యేలా వివరించారు. సాంకేతికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్లలకు మానసిక ప్రశాంతత ఇవ్వడమే లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహించారు.

చిన్నారులకు ఆధునిక విద్యతోపాటు ధార్మిక కార్యక్రమాలపై అవగాహన

‘అహెలే హదీస్‌’ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంపు

పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు

మార్గదర్శకం

ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు

Advertisement
 
Advertisement
Advertisement