సోలార్‌ పథకాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ పథకాలను వినియోగించుకోవాలి

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

స్టేషన్‌ఘన్‌పూర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆర్థిక భరోసా కోసం అందిస్తున్న సోలార్‌ విద్యుత్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ జి.అనిత అన్నారు. గురువారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు సోలార్‌ విద్యుత్‌ వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ విద్యుత్‌ వినియోగంతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. మోడల్‌ సోలార్‌ విలేజ్‌ కార్యక్రమం కింద నిర్దేశించిన గ్రామాల్లోని ప్రతీ వ్యవసాయ పంపుసెట్‌కు 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేస్తారన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి రూఫ్‌పై సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్‌ పొందొచ్చన్నారు. అనంతరం ఎన్పీపీడీసీఎల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ డీఈ సారయ్య మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాల నివారణకు రైతులు భద్రతాసూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవికాంత్‌, ట్రాన్స్‌కో ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈ శివకుమార్‌, సర్పంచ్‌లు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, పోలెపల్లి సంపత్‌రెడ్డి, మంతెన హరితాఇంద్రారెడ్డి, సోమేశ్వర్‌, యాదగిరి, లక్ష్మణ్‌, ఎంపీడీఓ విజయశ్రీ, ఏఓ చంద్రన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ రాష్ట్ర డీడీ అనిత

Advertisement
 
Advertisement
Advertisement