వడదెబ్బతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో రైతు మృతి

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

మొగుళ్లపల్లి: వడదెబ్బతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు మోడే బాపురావు (64) మృతి చెందాడు. బాపురావు ఈనెల 1న తన మొక్కజొన్న చేనులో పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఎండతీవ్రతకు అస్వస్థకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని పోలీసులపై ఫిర్యాదు

మల్హర్‌(కాటారం) : కాటారం పీఎస్‌లో దళిత యువకుడు రామిల్ల అంజిపై ఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ విచారణ పేరుతో చేసిన విచక్షణారహితంగా దాడి చేశారని జాతీయ ఎస్సీ కమిషన్‌, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, రాష్ట్ర డీజీపీకి నేరుగా ఫిర్యాదు చేసినట్ల బాధితుడి సోదరుడు రామిల్ల రాజాబాపు గురువారం తెలిపారు. తన సోదరుడు అంజిని ఈనెల 1 తేదీన రాత్రి ఓ కేసు విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి బలవంతంగా కాళ్లు మొక్కించుకొని ఇంటికెళ్లాలని హింసించారని రాజాబాపు ఆరోపించారు. దెబ్బలతో అంజి నడవలేని స్థితిలో ఉండడంతో మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. వైద్యులు అంజి శరీరంపై చాలా చోట్ల లాఠీ దెబ్బలు ఉన్నాయని నిర్ధారించారన్నారు. దీంతో భూపాలపల్లి కలెక్టర్‌, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో హెదరాబాద్‌లోని జాతీయ సంస్థలకు, రాష్ట్ర డీజీపీకి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినట్లు రాజాబాపు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement