ప్రయాణికురాలికి హ్యాండ్‌ బ్యాగు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలికి హ్యాండ్‌ బ్యాగు అప్పగింత

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

ఖిలా వరంగల్‌: బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణిస్తున్న ఏపీ గుడివాడకు చెందిన గెల్లి శ్రీదేవి హ్యాండ్‌ బ్యాగు గురువారం తెల్లవారుజామున వరంగల్‌ రైల్వేస్టేషన్‌ చింతలపల్లి స్టేషన్ల మధ్య కిందపడిపోయింది. ఈ క్రమంలో వరంగల్‌ జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ ఆదేశాల ప్రకారం జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌, కానిస్టేబుల్‌ నయీంపాషా, ఎస్‌కే పాషా రంగంలోకి దిగారు. రైలు పట్టాలపై పడిఉన్న రూ.30 వేల విలువైన సెల్‌ఫోను, రూ.10వేల నగదు గల హ్యాండ్‌ బ్యాగ్‌ను గుర్తించారు. అనంతరం బాధితురాలు శ్రీదేవికి జీఆర్పీ పోలీసులు గురువారం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement