రామప్పలో హైకోర్టు జడ్జి పూజలు వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వాకిటి రామకృష్ణా రెడ్డి దంపతులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ , అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్.. జడ్జి దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయ మండపంలో జడ్జి దంపతులను ఈఓ సన్మానించగా, అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వివరించారు. రామప్ప సరస్సును సందర్శించారు. వారి వెంట ఎస్సై చల్ల రాజు, ఆర్‌ఐ రమేశ్, కానిస్టేబుళ్లు భద్రు, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
‘వన్ మినిట్ రూల్’తో
భద్రతకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్ : విద్యుత్ సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తూ టీజీఎన్పీడీసీఎల్‌లోన ‘వన్ మినిట్ రూల్’ అమలు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి గురువారం తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించడం ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పనికి ముందు లైన్ క్లియర్ పొందడం, ఇండక్షన్ టెస్టర్‌తో లైనన్‌లో విద్యుత్ లేదని నిర్ధారించుకోవడం, పీపీఈ కిట్లు ధరించడం, ఎర్తింగ్ ఏర్పాటు, డబుల్ ఫీడింగ్ లేకుండా చూడడం, పరికరాల భద్రతను పరిశీలించడం వంటి అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలు తగ్గించి సిబ్బంది ప్రాణాలు రక్షించడమే లక్ష్యమని తెలిపారు. ‘ఒక్క నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత’ అనేదే ‘వన్ మినిట్ రూల్’ ప్రధాన సందేశమని సీఎండీ వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు.
మక్కల కొనుగోళ్లలో
ప్రభుత్వం విఫలం
‘సమస్యల పరిష్కారానికి
ఐక్యంగా ముందుకు’..
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
ఖిలా వరంగల్: మక్కల కొనుగోళ్లల్లో ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న యార్డును నాయకులు గురువారం ఉదయం సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ మక్కలు అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ మాత్రం గడప కూడా దాటడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 11న ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలకు పార్టీ పిలుపునిచ్చిందని, రైతులు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, ఈసంపల్లి బాబు, కుమారస్వామి, మున్యాల సాయిలు, బోళ్ల సాంబయ్య, అరూరి కుమార్, రత్నమాల, బషీర్, దుర్గయ్య, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల మిగిలిన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియలో అన్ని సంఘాలకు ప్రాతినిథ్యం వహించాలని, విలీనం చేసే క్రమంలో 2025 పే స్కేల్ ప్రకటించాలని, కరువు భత్యాన్ని తగ్గించొద్దని, తార్నాక ఆస్పత్రిని కొనసాగించాలని, మరింత మెరుగైన వైద్యం కోరారు. ప్రజాతంత్ర హక్కు అయిన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్మికులే నిర్వహించుకుంటున్న కో–ఆపరేటివ్ సొసైటీని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.