ఉత్తమ సేవలతో ఆదరాభిమానాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలతో ఆదరాభిమానాలు

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవలతో ప్రజల ఆదరాభిమానాలు పొందుతారని జిల్లా జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ అన్నారు. జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి క్రాంతికుమార్‌ సూర్యాపేట జిల్లా కోర్టుకు బదిలీఅయ్యారు. ఈ సందర్భంగా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేయగా జిల్లా జడ్జి అబ్దుల్‌ రఫీ మాట్లాడారు. జిల్లా కోర్టులో మూడున్నర సంవత్సరాలపాటు ఏఓ క్రాంతికుమార్‌ విధినిర్వహణలో అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ అందరికి సహకారం అందించారని కొనియాడారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి శాలినిశాకెల్లి, జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్‌ జడ్జి కృష్ణతేజ్‌, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి అనిత, ఉపాధ్యక్షుడు స్వరూపరాణి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీశ్రీనివాస్‌, కోశాధికారి వీరునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement