కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకటనారాయణను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. దీంతో కేయూ సైకాలజీ విభాగంలో వెంకటనారాయణను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, పూలే ఆశయ సాధనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ సన్మానించారు. శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య భిక్షాలు, విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ శాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


