అక్షరమే ఆయుధంగా.. | - | Sakshi
Sakshi News home page

అక్షరమే ఆయుధంగా..

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

ప్రతీ వేసవిలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాస్‌లతో సమాజమార్పునకు కృషి చేస్తున్న లీడ్‌ ఫౌండేషన్‌

నర్సంపేట: పేదరికం అనే సమస్యను అధిగమించేందుకు శక్తివంతమైన సాధనం చదువు మాత్ర మేనని నమ్మి ‘పేదరికంపై యుద్ధానికి చదువే ఆ యుధం’ అనే నినాదంతో సమాజంలో మార్పు తీ సుకురావడానికి లీడ్‌ ఫౌండేషన్‌ ద్వారా రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.. ప్రభుత్వ ఉపాధ్యాయు డు కాసుల రవికుమార్‌, శోభారాణి దంపతులు.

వేసవి సెలవుల్లో కలల నిర్మాణం

వేసవి సెలవులంటే పిల్లలకు విశ్రాంతి సమయంగా భావిస్తారు. కానీ లీడ్‌ ఫౌండేషన్‌ దృష్టిలో ఇది వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్యాల అభివృద్ధికి అత్యంత విలువైన సమయం. అందుకే ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల్లో ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తూ పిల్లల జీవితాలకు కొత్త దిశను చూపిస్తోంది ఈ ఫౌండేషన్‌. ఈ తరగతుల్లో కేవలం ఆంగ్ల అంశాల బోధనే కాకుండా, స్టోరీ టెల్లింగ్‌, చెస్‌, హ్యాండ్‌ రైటింగ్‌ నేర్పిస్తున్నారు.

గ్రామీణ గ్రంథాలయాలు

దశాబ్ద కాలంగా లీడ్‌ ఫౌండేషన్‌ చేపట్టిన మరో కార్యక్రమం గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటు. పాఠశాలలు, గ్రామాల్లో గ్రంథాలయాలను స్థాపించి పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిచడమే లక్ష్యంగా ఫౌండేషన్‌ పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషపై భయం పోగొట్టేందుకు లీడ్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా శిక్షణా విధానం రూపొందించింది. ఈ శిక్షణతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్నారు.

పేద పిల్లలకు వరం..

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఈ తరగతులు నిజంగా ఒక వరం. వారు కేవలం చదువుకోవడమే కాకుండా తమ జీవితాన్ని మార్చుకునే ందుకు ఈ ఫౌండేషన్‌ సహకరిస్తుంది. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం చెప్పినట్లుగా ‘కలలు కనే వారు మా త్రమే కాదు. ఆ కలలను సాధించడానికి కృషి చేసే వారే విజేతలు.’ ఈ భావాన్ని కార్యరూపంలో చూపిస్తూ లీడ్‌ ఫౌండేషన్‌ విద్యార్థులకు కలలు కనడం, వాటిని సాధించడం రెండింటినీ నేర్పిస్తుంది.

రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు

గ్రంథాలయాల ఏర్పాటుతో

పఠనాసక్తి పెంపు

Advertisement
 
Advertisement
Advertisement