చిలుక –జింక స్నేహం
ఒక అడవిలో స్నేహితులైన చిలుక, జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయల్దేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బతగిలి ఎగరలేకపోతున్న దానిలా చిలుక నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్లాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదటున పారిపోయింది. వేటగాడు పట్టుకొనే లోపు చిలుక సైతం రివ్వున ఎగిరిపోయింది. దీంతో నిరాశతో ఆ వేటగాడు ఇంటిబాటపట్టాడు.
– ఆత్మకూరు
నీతి: నిజమైన స్నేహితులు ఆపద సమయంలో ఒకరికొకరు అండగా ఉండాలి
– ఫౌజియా
8వ తరగతి ,స్పెక్ట్రా హైస్కూల్, ఆత్మకూరు
ఫౌజియా


