భలే ఐడియా.. | - | Sakshi
Sakshi News home page

భలే ఐడియా..

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

సోరకాయతో పక్షి గూడు

పరకాల: ఎండలతోపాటు గాలిదుమారాలతో పక్షుల గూళ్లు కిందపడి పక్షులు అయోమయానికి గురవుతున్నాయి. ఇది చూసి చలించిపోయిన పరకాల పట్టణానికి చెందిన 2వ తరగతి విద్యార్థిని అభిజ్ఞ తమ ఇంటిఆవరణలో కాసిన గుండ్రటి సోరకాయలతో పక్షి గూడులను తయారు చేసింది. సోరకాయలోని గుజ్జు, గింజలను తొలగించి లోపల ఖాళీ చేసింది. కాయ బయట పచ్చని రంగులు వేసి ప్రకృతిలో ఆ కాయను మమేకం చేసింది. ఆ సోరకాయ పక్షిగూడును ఇంటి సమీపంలోని చెట్టుపై కట్టింది. అదిచూసిన పక్షులు ఆ గూడులో సేదదీరుతుంటే చిన్నారి మురిసిపోతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన పెద్దనాన్న శ్రీనివాస్‌ సూచనలతో ఖాళీ కూల్‌డ్రింక్‌ బాటిళ్లతో పక్షుల కోసం నీటి తొట్టెలు తయారుచేసి అందరిచేత ఔరా అనిపించుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement