స్టేషన్‌ఘన్‌పూర్: ప్రస్తుతం పిల్లలకు వేసవికాలం సెలవులు రావడంతో ఇళ్లలో వారు చేసే అల్లరి అంతాఇంతా కాదు. రోజంతా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నారులకు సెల్‌ఫోన్లు, టీవీ లకు అతుక్కుపోతున్నారు. అయితే అందుకు భిన్నంగా హైదరా బాద్ నుంచి ఘన్‌పూర్‌లోని అమ్మమ్మ ఇంటి కి వచ్చిన చిన్నారి సింగం సరయు మాత్రం సెల్‌ఫోన్, టీవీకి దూరంగా పియానో నేర్చుకుంటూ వేసవిసెలవులను ఆస్వాదిస్తోంది. ఇప్పటికే పియానోలో బేసిక్స్ నేర్చుకున్న ఈ చిన్నారి అమ్మమ్మ గారి ఇంటిపక్కన స్నేహితులకు కూడా నేర్పిస్తూ సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.


