మహబూబాబాద్ రూరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారి జయ ంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని శ్రీవాసవీ దేవాలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తాటిపాముల దుర్గాప్రసాద్ అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరి పారు. గర్భగుడిలోని శ్రీవాసవీమాత మూలవిరాట్ మూర్తిని పట్టువస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ ద్వారా అర్చన పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. శ్రీవాసవి మాత జెండా ఆవిష్కరణ చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యిమ్మడి రవికుమార్, గీతారాణి, శ్రీరంగం కిశోర్ సుభాషిని, చౌడవరపు శేషగిరి, ఉషారాణి, తల్లాడ విజయ్, వేమిశెట్టి కిశోర్ కుమార్, నాళ్ల నరసింహారావు, జంగాల విజయ్, శ్రీరాం పురుషోత్తం, శ్రీరాం ప్రసాద్, వల్లాల సాయికృష్ణ, యిమ్మడి చంద్రప్రకాశ్, యాదా సోమయ్య, శ్రీరాం రమణ ఎస్వీ.నాగేశ్వరరావు, బొడ్ల కామేశ్వర్ రావు, భక్తులు పాల్గొన్నారు.


