వరంగల్ జిల్లాలో ఇద్దరే కోచ్‌లు..
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదువ లేదు. కానీ, సరైన సదుపాయాలు లేకపోవడం వారి పాలిట శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ను ఆరు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నాయి. అయితే ఇన్నేళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, చేసింది శూన్యమని క్రీడాకారులు పేర్కొంటున్నారు. కొత్త జిల్లాల్లో నిర్మించిన స్టేడియాలు లేవు .. కొన్ని జిల్లాల్లో స్టేడియాలు ఉంటే కోచ్‌లు లేకపోవడం, మరికొన్ని జిల్లాల్లో స్టేడియాలుండవు, కోచ్‌లు ఉండరు.. అయితే క్రీడల అధికారులు మాత్రమే ఉంటారు. శిక్షణ ఇవ్వాల్సిన కోచ్‌లు, శిక్షణకు కావాల్సిన మైదానాలు ఇవేమి లేకుండా జిల్లా యువజన, క్రీడల అధికారులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావాలని పలువురు క్రీడాకారులు వివమర్శిస్తున్నారు.
ఊకదంపుడు ప్రసంగాలే..
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా క్రీడాకారుడు.. క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక సందర్భాల్లో వేదికలపై పేర్కొనడం పరిపాటిగా మారింది. అయితే ప్రజాప్రతినిధుల ప్రసంగాలు ఊకదంపుడే తప్పితే ఆచరణ లేందటూ క్రీడాకారులు బాహాటంగానే చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా క్రీడాభివృద్ధికి చేసిందేమి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జిల్లాల్లో క్రీడల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
హనుమకొండ జిల్లా కాస్త నయం..
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం హనుమకొండ కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మించిన జవహర్‌లాల్ నె హ్రూ స్టేడియం ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద ది క్కుగా నిలిచింది. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జేఎ న్‌ఎస్ హనుమకొండ జిల్లాకు పరిమితమైంది. జేఎ న్‌ఎస్ పరిధిలో రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టే డియం, స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం హాల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ లాంటి హంగులు సంతరించుకుంది. తాజాతాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ స్టేడియంలో ప్రారంభం కావడం విశేషం.
ములుగు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓగా
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
ములుగు జిల్లాలో ఇప్పటి వరకు స్టేడియం లేదు. కోచ్‌ల నియామకం లేదు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారిని మాత్రం ప్రభుత్వం నియమించడం హాస్యాస్పదం. క్రీడల అధికారిగా ములుగు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అజ్మీరా ధర్మనాయక్ కొనసాగుతున్నారు. ధర్మనాయక్ ఈడీతో పాటు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ, ఇన్‌చార్జ్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి, ఇలా మూడు పదవులు ఒక్కరే నిర్వహిస్తుండడం విశేషం.
జనగామకు మినీ స్టేడియమే
జనగామ జిల్లాకు మినీ స్టేడియం, ఒక ఇండోర్ స్టేడియం తప్పితే ఇతర క్రీడాంశాల్లో శిక్షణ పొందాలనుకునే వారికి సదుపాయాలు లేవు. ఇక కోచ్‌ల నియామకం ఊసే లేదు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి కోదండరాం డీవైఎస్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా
క్రీడారంగ దుస్థితి
పీఈటీలు, తాత్కాలిక ఉద్యోగులే
డీవైఎస్‌ఓలు
క్రీడల అధికారులుగా
క్రీడేతర విభాగాలు
అరకొర వసతులు..
అంతుచిక్కని సమస్యలు
ఇలాగైతే పతకాలు సాధించేదెలా?
నో స్టేడియం, నో కోచెస్..
– భూపాలపల్లి జిల్లాకు పీఈటీనే డీవైఎస్‌ఓ
భూపాలపల్లి జిల్లా ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా నేటికీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం నిర్మాణం లేదు. కోచ్‌ల నియామక ఊసే లేదు. అయితే జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారిగా గోరికొత్తపల్లిలో స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చిర్ర రఘు విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టరేట్‌లో డీవైఎస్‌ఓ ఆఫీస్ కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు స్టేడియం నిర్మాణం, కోచ్‌ల నియామకకాపై తీసుకున్న చర్యలు శూన్యం.
మహబూబాబాద్‌లో
స్టేడియం ఉంది.. కోచ్‌లు లేరు
– ీపీఈటీనే డీవైఎస్‌ఓ
మహబూబాబాద్ జిల్లాలో ఎన్‌టీఆర్ స్టేడియం ఉన్నా అందులో సదుపాయాలు కల్పించడంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కొత్తగా జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా జిల్లా క్రీడా ప్రాధి కార సంస్థ నుంచి ఒక్క కోచ్‌ను ప్రభుత్వం నియమించకపోవడం విశేషం. ఇక మహబూబాబాద్ డీవైఎస్‌ఓగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (గార్ల) జ్యోతి రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
14 మంది తాత్కాలిక కోచ్‌లే
క్రీడా సదుపాయాలు ఉన్నప్పటికీ ఇక్కడ శిక్షణ ఇచ్చే 14 మంది తాత్కాలిక ఉద్యోగులే. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఔట్‌సోర్సింగ్ కోచ్‌లే కొనసాగుతున్నారు. పే అండ్ ప్లే పద్ధతిలో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్నారు. అయితే స్టేడియం నిర్వహణ కోసం గ్రౌండ్‌మెన్లు లేకపోవడంతో కళావిహీనంగా మారింది.
వరంగల్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వరంగల్ కాశిబుగ్గలోని ఓసిటీ మైదానంలో కొనసాగుతుంది. డీవైఎస్‌ఓగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనిల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ డీఎస్‌ఏలో పే అండ్ ప్లే పద్ధతిలో క్రికెట్, జూడో కోచ్‌లు కొనసాగుతుండగా, ఖేలో ఇండియా సెంటర్‌లో మరో జూడో కోచ్ ఉన్నారు. మహానగరంలో కీలకమైన వరంగల్‌లో కేవలం ఇద్దరే కోచ్‌లు ఉండడం ఆలోచించాల్సిన విషయమే. జిల్లాలోని నర్సంపేటలో మినీ స్టేడియం ఉండగా అక్కడ రెజ్లింగ్, కబడ్డీ కోచ్‌లు ఉన్నట్లు డీవైఎస్‌ఓ అనిల్ చెబుతున్నారు. ఆచరణలో ఏ స్థాయిలో ఉందో అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇక ఓసిటీలోని డీవైఎస్‌ఓ ఆఫీస్‌లో యువజన సర్వీసుల శాఖ సిబ్బంది ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక రికార్డు అసిస్టెంట్ విధుల్లో ఉన్నారు.


