ఎకై ్సజ్‌శాఖలో బదిలీల సందడి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌శాఖలో బదిలీల సందడి

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

సాక్షి, మహబూబాబాద్‌: ఎకై ్సజ్‌శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. ముందు కానిస్టేబుళ్లు, తర్వాత ఎస్సైలు, ఆ తర్వాత సీఐ, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు అనివార్యమనే సంకేతాలు రావడంతో ఆశాఖలో సందడి మొదలైంది. అయితే బదిలీలతో ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో అనే ఆందోళన వారిలో నెలకొంది.

భద్రాద్రి జోన్‌ పరిధిలోకి బదిలీ..

గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోనే బదిలీ లు ఉండేవి. దీంతో కుటుంబాలకు దగ్గరగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న ఎకై ్సజ్‌శాఖ కానిస్టేబుళ్లకు ఇప్పుడు జోనల్‌ బదిలీల భయం పట్టుకుంది. జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు, గూడూరు సర్కిళ్లతో పాటు, డీటీఎఫ్‌ విభాగం పరిధిలో మొత్తం ఎనిమిది మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 36 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఇందులో కొత్తగా నియామకమైన వారికి మినహా అందరికీ స్థాన చలనం తప్పదు. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ములుగు, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాలతోపాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియ అంతా జిల్లాస్థాయి అధికారుల నుంచి ఉమ్మడి జిల్లా అధికారికి, అక్కడి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరింది. ప్రక్రియ వేగవంతం చేసి వచ్చే సోమవారం వరకు కొత్త స్టేషన్లలో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ఎకై ్సజ్‌ శాఖలోని అధికారులు చెబుతున్నారు.

తర్వాత అధికారులకు..

బదిలీ ప్రక్రియ కానిస్టేబుళ్లతోనే ఆగకుండా అన్ని విభాగాలకు చెందిన అధికారులకు కూడా ఉంటుందని ఆశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందుగా కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ ముగియగానే.. ఎస్సైలు, సీఐలు, ఈఎస్‌ మొదలైన వారి బదిలీ కూడా అనివార్యం. అయితే రెండు సంవత్సరాల సర్వీస్‌ నిబంధనల ఉండడంతో జిల్లాలో పనిచేస్తున్న అధికారుల్లో దాదాపుగా అందరూ బదిలీ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారు రానున్నారు.

కానిస్టేబుళ్ల బదిలీ జాబితా సిద్ధం

భద్రాద్రి జోన్‌ పరిధికి వెళ్లేవారిలో కలవరం

త్వరలో అధికారుల ట్రాన్స్‌ఫర్స్‌ఉంటాయని చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement